• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైకోకు జయ వల: డిఎంకె విలవిల

By Staff
|

చెన్నై: తమిళనాడులో డిఎమ్‌కె-డెమాక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ కూటమికి గురువారం పెద్ద దెబ్బ తగిలింది. డిఎమ్‌కె కూటమిలో పెద్ద పార్టీ అయిన ఎమ్‌డిఎమ్‌కె తమిళనాడు అధికార పార్టీ ఎఐఎడిఎమ్‌కె తో చేతులు కలిపింది. ఈ మేరకు గురువారం 11.45గంటలకు ఎమ్‌డిఎమ్‌కె నేత వైకో ఎఐఎడిఎమ్‌కె అధ్యక్షురాలు తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలితతో మంతనాలు జరిపారు. మే 8న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్‌డిఎమ్‌కెకు జయలలిత 35 సీట్లు ఇవ్వటానికి అంగీకరించటంతో వైకో పార్టీలో చేరినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. డిఎమ్‌కెకు, ఎమ్‌డిఎమ్‌కెకు కేవలం సీట్ల పంపకంలో తేడాలు రావటంతో వైకో పార్టీ మారినట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. 22 సీట్లు ఇస్తాం తీసుకుంటే తీసుకో లేదంటే పార్టీ విడిచి వెళ్లొచ్చు అని డిఎమ్‌కె చీఫ్‌ కరుణానిధి ఎమ్‌డిఎమ్‌కెకు అల్టిమేటం ఇవ్వటంతో ఆ పార్టీ చీఫ్‌ వైకో జయలలితతో చేతులు కలిపారని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X