వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగూలీ ఎంపిక ప్రసక్తే లేదు: కిరణ్‌ మోరే

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడాలనే ఆశను భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ వదులుకోవాల్సిందేనని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ కిరణ్‌ మోరే కరాఖండిగా చెప్పారు. దేశవాళీ మ్యాచ్‌ల్లో రాణించినా అంతర్జాతీయ మ్యాచ్‌లకు గంగూలీని ఎంపిక చేసే ప్రసక్తే లేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. భారత జట్టు కెప్టెన్‌గా గంగూలీ ఎక్కువ విజయాలు సాధించినా గంగూలీని జట్టులోకి ఎంపిక చేయబోమని ఆయన అన్నారు.

ప్రస్తుత సెలెక్షన్‌ కమిటీ ఉన్నంత కాలం జాతీయ జట్టుకు గంగూలీ ఎంపిక కాబోరని ఆయన చెప్పారు. ఈ విషయంలో సెలెక్షన్‌ కమిటీ సభ్యులు ఐదుగురు ఏకాభిప్రాయంతో ఉన్నారని ఆయన అన్నారు. గంగూలీ ఎంపిక కోసం అన్ని వైపుల నుంచి వత్తిళ్లు వస్తున్నప్పటికీ జట్టు మేలు కోరి జట్టులోకి తీసుకోబోమని ఆయన చెప్పారు. కిరణ్‌ మోరే ప్రకటనను బట్టి గంగూలీ క్రికెట్‌ జీవితానికి తెరపడినట్లేనని అనుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X