వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
610 జీవోపై జానా మీద టిఆర్‌ఎస్ వత్తిడి
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత సానుభూతి పరుడిగా పేరున్న హోం మంత్రి జానారెడ్డిని 610 జీవోపై తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు కలుసుకున్నారు. స్ధానిక, స్ధానికేతర ఉద్యోగులను నిర్వచించిన 610 జీవోపై ఇటీవల పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. పోలీసు శాఖలో స్ధానికేతర సిబ్బందిని, వారి ప్రాంతాలకు పంపించి హైదరాబాద్ నగరంలోనూ, తెలంగాణ జిల్లాల్లోనూ స్ధానికి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హోంమంత్రి జానారెడ్డిని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని వారు అభ్యర్ధించారు. గతంలో అనేక సార్లు 610 జీవోను సమర్ధించిన జానారెడ్డి తన మాట నిలబెట్టుకోవాలని వారు కోరారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!