వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీంనగర్‌లో పది మంది నక్సల్స్ లొంగుబాటు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ ముందు బుధవారంనాడు పది మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో జనశక్తి, సిపిఐ (యంయల్), ప్రతిఘటన నక్సలైట్లు ఉన్నట్లు యస్పీ మీడియా ప్రతినిధులకు చెప్పారు. లొంగిపోయినవారిలో దళసభ్యులు, నాయకులు ఉన్నారు. లొంగిన నక్సలైట్లలో ఒక మహిళ ఉంది.
మొత్తం 13 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు, మరో ముగ్గురిని మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు సమయం పడుతుందని ఆయన చెప్పారు. లొంగిపోయిన నక్సలైట్లలో సిపిఐ (యంయల్) జనశక్తి జిల్లా సభ్యుడు రమేష్ కూడా ఉన్నాడు. లొంగిపోయిన నక్సలైట్లకు తమ నుంచి పూర్తి సహకారం ఉంటుందని, పునరావాసానికి తగిన సహాయం అందజేస్తామని యస్పీ చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!