వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్‌ జైలు శిక్షపై సెషన్స్‌ కోర్టు స్టే

By Staff
|
Google Oneindia TeluguNews

జోథ్‌పూర్‌: కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు కాస్తా ఊరట లభించింది. సల్మాన్‌ఖాన్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై జోథ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్‌లో జరుగుతుంది.

హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సినిమా షూటింగ్‌ సందర్భంగా 1998లో రెండు కృష్ణ జింకలను చంపాడనే ఆరోపణపై నడిచిన కేసులో కింది కోర్టు సల్మాన్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కృష్ణ జింకల వేట కేసులో ఇతర సహనటులు సోనాలి బింద్రే, సైఫ్‌ అలీఖాన్‌, టాబు, నీలం, సతీష్‌ షా కూడా సహనిందితులు. అయితే సల్మాన్‌ను మినహా మిగతా అందరినీ కోర్టు కేసు నుంచి విముక్తులను చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X