వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శాసనసభ నుంచి తెరాస సభ్యుల వాకౌట్
హైదరాబాద్: చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు శుక్రవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. చిన్న తరహా ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెరాస శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు విమర్శించారు.
తెరాస విమర్శను చిన్న నీటి పారుదల శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఖండించారు. చిన్ననీటి పారుదల కేటాయింపుల్లో 60 నిధులను తెలంగాణ ప్రాంతానకే కేటాయించినట్లు ఆయన తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!