వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనిల్‌కుంబ్లేపై ప్రశంసల వర్షం

By Staff
|
Google Oneindia TeluguNews

మొహాలీ: టెస్టు క్రికెట్లో 500 వికెట్ల అరుదైన రికార్డును సాధించిన తొలి భారత స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేకు 600 వికెట్ల మైలురాయిని సైతం చేరుకొనే సత్తా ఉందని పలువురు మాజీక్రికెటర్లు అభిప్రాయపడ్డారు. భారత నెంబర్‌వన్‌ బౌలర్‌ కుంబ్లే అలుపెరుగకుండా రాణించడం జాతికేగర్వకారణమని 1983 ప్రపంచకప్‌ విజేత భారతజట్టు కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ వ్యాఖ్యానించారు. 500 వికెట్ల రికార్డు లక్ష్యాన్ని కుంబ్లే చేరుకోగలడని ఏ ఒక్కరూ అనుకోలేదని 434 టెస్టువికెట్లు పడగొట్టిన అనుభవం ఉన్న కపిల్‌ అన్నారు అంకితభావం, ఆత్మవిశ్వాసమే కుంబ్లేను ముందుకు నడిపిస్తున్నాయని కపిల్‌ అభిప్రాయపడ్డారు.

అనిల్‌ కుంబ్లేను భారతక్రికెట్‌కు లభించిన ఓ అమూల్యవరంగా మాజీకెప్టెన్‌, 266 వికెట్లు తీసిన బిషిన్‌సింగ్‌ బేడీ అభివర్ణించారు. సంవత్సరాల తరబడి ఒకేవిధంగా రాణిస్తున్న కుంబ్లే రికార్డులన్నింటికీ అర్హుడని అన్నారు. నిరంతరం వికెట్లు ఏవిధంగా పడగొట్ట వచ్చునో కుంబ్లే ప్రపంచానికి చాటిచెప్పిన గొప్పబౌలరని మాజీ ఆఫ్‌స్పిన్నర్‌ ప్రసన్న కొనియాడారు. వికెట్‌తో పనిలేకుండా రాణించడమే తన విధి అన్నట్లుగా భావించే కుంబ్లేని తిరుగులేని బౌలర్‌గా మాజీకెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌ ప్రశంసించారు. ఆరేళ్ల క్రితం భుజం ఆపరేషన్‌ చేయించుకొన్న తరువాత కూడా కుంబ్లే మరింత అద్భుతంగా రాణించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు. గత 15 సంవత్సరాలుగా కుంబ్లే ఒకేవిధంగా రాణిస్తూ రికార్డుల వెంటరికార్డులు నెలకొల్పడం తనకు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదని మాజీ క్రికెటర్‌ సందీప్‌పాటిల్‌ అన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X