వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇసి నాకు తల్లి లాంటిది: కెజె రావు

By Staff
|
Google Oneindia TeluguNews

చీరాల: ఎన్నికల కమీషన్‌ తనకు తల్లి లాంటిదని, అమ్మ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడమే తన బాధ్యత అని ఎన్నికల కమీషన్‌ మాజీ సలహాదారు కె.జె. రావు అన్నారు. చీరాలలో లోక్‌సత్తా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత నుంచి తప్పుకోవడానికి రాజకీయ ఒత్తిళ్లు కారణం కాదని, ఇతర ప్రత్యేక కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు.

సమాజం కోసం భవిష్యత్తులో తాను కచ్చితంగా ఒక మంచి కార్యక్రమం చేపడతానని ఆయన చెప్పారు. బెస్ట్‌ బేకరీ కేసును ఉదహరిస్తూ తాను ఒక పుస్తకం రాస్తానని ఆయన చెప్పారు. దేశంలో ఎన్నికల నిర్వహణ కోసం ఇండియన్‌ ఎలక్షన్‌ సర్వీసును ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X