72 జీవోకు మెజారిటీ రాజకీయ నేతలు వ్యతిరేకం
72 నెంబర్ జీవో వల్ల గిర్గ్లానీ కమీషన్ నివేదిక అమలుకు అవరోధాలు ఏర్పడతాయని వారంటున్నారు. 610 జీవో ఆధారంగా స్థానికేతర ఉద్యోగుల బదిలీ నుంచి 51 ప్రభుత్వ శాఖలకు మాత్రమే మినహాయింపు లభిస్తుందని, తాజాగా జారీ చేసిన 72 నెంబర్ జీవో వల్ల ఆ శాఖల సంఖ్య 108కి పెరుగుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా గిర్గ్లానీ కమీషన్ నివేదికను అమలు చేయడానికి బదులు కొత్తగా జీవో విడుదల చేయడం సరైంది కాదని వారంటున్నారు. హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించాలనే గాదె వెంకటరెడ్డి వంటి కోస్తా కాంగ్రెస్ నాయకులను సంతృప్తి పరచడానికే ఈ జీవోను ప్రభుత్వం జారీ చేసిందనే విమర్శలు వచ్చాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరైంది కాదని అత్యధికులు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో గాదె వెంకటరెడ్డి, మండలి బుద్ధప్రసాద్, జి. చిన్నారెడ్డి (కాంగ్రెస్), టి. దేవేందర్ గౌడ్ (టిడిపి), నోముల నరసింహయ్య (సిపియం), చాడ వెంకటరెడ్డి (సిపిఐ), విజయరామారావు, నాయని నర్సింహారెడ్డి (తెలంగాణ రాష్ట్రసమితి) పాల్గొన్నారు. శాసనసభ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఇచ్చిన హామీ ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!