వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
27వరకు మోనికా జ్యుడిష్యల్ రిమాండ్ పొడగింపు
హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టుల కేసులో సినీనటి, అండర్ వరల్డ్ డాన్ ప్రియురాలు మోనికా బేడీ జ్యుడిష్యల్ కస్టడీని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించింది. జ్యుడిష్యల్ రిమాండ్ గడువు ముగియడంతో మోనికా బేడిని సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు.
ఇదిలావుంటే, ఈ కేసులో సహనిందితుడైన అబూ సలేం బెయిల్ పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఈ నెల 27వ తేదీన విచారణ చేపడుతుంది. మోనికా బేడీ కేసుతో కలిపి సలేం కేసును విచారించాలని సలేం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇద్దరి కేసులను విడి విడిగా విచారించడం వల్ల అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, March 13, 2006, 23:53 [IST]