వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కమలం మద్దతు మాకు ఆశావహం: కెసిఆర్
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణబిల్లుకు బిజెపి మద్దతుపై తెలంగాణ రాష్ట్ర సమితి హర్షం వ్యక్తం చేసింది. యుపిఎ ప్రభుత్వం తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే మద్దతిస్తామని బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రకటించడంపై టిఆర్ఎస్ అధ్యక్షుడు, కేంద్ర కార్మిక మంత్రి కె. చంద్రశేఖరరావు సంతోషం ప్రకటించారు. ఈ సందర్భంగా కెసిఆర్ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో త్వరలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంను సాధిస్తామనే ధీమాను కెసిఆర్ వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో తెలంగాణబిల్లు ప్రవేశపెట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.
బిజెపి నుంచి రాతపూర్వకంగా ఎటువంటి హామీ తీసుకోలేదని కెసిఆర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజల సమక్షంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రకటించినపుడు ఇంకా లేఖలు తంతు ఎందుకని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇక లేఖలు అవసరం లేదని ఇక అంతా తెలంగానమేనని ఆయన చెప్పారు. బిజెపి తన వైఖరి స్పష్టం చేసిన నేపథ్యంలో త్వలోనే తెలంగాణపై నియమించిన ప్రణబ్ ముఖర్జీ నివేదిక రాగలదనే ఆశాభావాన్ని కెసిఆర్ వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు బిజెపి వైఖరి స్పష్టం చేయకపోవడం వల్లే ప్రణబ్ నివేదిక ఆలస్యమయిందని కెసిఆర్ అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!