వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సూరి ఆగడాలపై జైలు సిబ్బంది తిరుగుబాటు
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల హత్య కేసులో నిందితుడైన మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి అనుచరుల తీరుపై అనంతపురం జిల్లా జైలు సిబ్బంది ధ్వజమెత్తుతున్నారు. సూరి అనుచరుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారంటున్నారు. సూరి అనుచరులకు బిర్యానీ ప్యాకెట్లు అందిస్తున్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. బిర్యానీ, మద్యం, సెల్ఫోన్లను అడ్డుకుంటున్నందుకు తమను హత్య చేయడానికి సూరి అనుచరులు కుట్ర పన్నారని జైలు సిబ్బంది ఆరోపిస్తున్నారు.
సూరి అనుచరులు జైలును ఏ క్షణంలోనైనా పేల్చి వేయవచ్చునని వారంటున్నారు. వారినైనా జైలు నుంచి తరలించండి లేదా తమనైనా బదిలీ చేయండి అని వారు విన్నవించుకుంటున్నారు. ఈ స్థితిలో జైలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైలుకు అదనపు సిబ్బందిని పంపించారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!