• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మంత్రి వద్ద వద్దు, స్పీకర్‌ వద్దే ఉంచాలి: విపక్షాలు

By Staff
|

హైదరాబాద్‌: ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను స్పీకర్‌ ముందు ఉంచాల్సిందేనని తెలుగుదేశం, సిపియం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) డిమాండ్‌ చేశాయి. అందుకు వారు మంగళవారం శాసనసభలో పట్టుబట్టారు. ఫైళ్లు మంత్రి పొన్నాల లక్ష్మయ్య వద్ద చూడవచ్చునని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చేసిన ప్రకటనను వారు అంగీకరించలేదు. మంత్రి వద్ద ప్రతిపక్షాల ఫ్లోర్‌లీడర్లందరూ ఒకేసారి చూడడానికి వీలుగా కార్యక్రమాన్ని ఖరారు చేయాలని సిపిఐ శాసనసభా పక్షం నాయకుడు చాడ వెంకటరెడ్డి సూచించారు.

ఫైళ్లు తారుమారయ్యే అవకాశం ఉందని, స్పీకర్‌ ముందు ఉంచితే ప్రభుత్వానికి ఆ అవకాశం లేకుండా పోతుందని, అందుకే స్పీకర్‌ వద్ద ఫైళ్లు పెట్టాలని తాము అడుగుతున్నామని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. మంత్రి వద్ద పరిశీలన కోసం ఫైళ్లను ఉంచిన సందర్భాలు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉందని, అదే సంప్రదాయాన్ని తాము పాటిస్తున్నామని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య అన్నారు. అయినా తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడలేదు. సభ్యులందరూ లేచి నిలబడి మాట్లాడుతున్న సమయంలోనే సభను స్పీకర్‌ అర్థాంతరంగా రేపటికి వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X