దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search

సోనియాకు మరొకరు సాటి రారు: వైయస్‌

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్‌: నైతిక విలువలను పాటించడంతో తనకు సాటిలేరని కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ మరోసారి నిరూపించుకున్నారని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రశంసించారు. నైతిక విలునలను పాటించే విషయంలో ప్రతి ఒక్కరూ సోనియా గాంధీ నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. భారత జాతి యావత్తు సోనియాను కొనియాడుతోందని ఆయన అన్నారు. సోనియా నాయకత్వంలోని పార్టీలో తాము ఉన్నందుకు గర్విస్తున్నామని ఆయన అన్నారు.

    సోనియాను కాపాడేందుకే పార్లమెంటును అర్థాంతరంగా వాయిదా వేశారనే విమర్శకు సోనియా ప్రతిస్పందించిన తీరు అపూర్వమని, సోనియా రాజీనామాలతో ప్రతిపక్షాల విమర్శలు తప్పని తేలిందని ఆయన అన్నారు. జాతీయ సలహా మండలి చైర్‌పర్సన్‌గా తనకు తెలిసి ఒక్క పైసా తీసుకోవడం లేదని, అయినా ప్రతిపక్షాలు సోనియాపై విమర్శలు చేశాయని ఆయన అన్నారు. రాజీవ్‌ గాంధీని ఎల్‌టిటిఇ మిలిటెంట్లు హత్య చేసినప్పుడు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా సోనియా తిరస్కరించారని, జాతీయతపై విమర్శలు వచ్చినప్పుడు సోనియా మరోసారి ప్రధాని పదవిని త్యజించారని ఆయన గుర్తు చేశారు.

    సోనియా రాజకీయ విలువలకు సంబంధించి ఆదర్శమని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు అన్నారు. దేశానికి సోనియా నాయకత్వం అవసరమని ఆయన అన్నారు. విలువలను పాటించడంలో సోనియా స్ఫూర్తి, నిబద్ధత సాటిలేనివని ఆయన అన్నారు. సోనియాపై బిజెపి సిగ్గుమాలిన విమర్శలు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. జయాబచ్చన్‌ వ్యవహారం సోనియాకు సంబంధం లేదని ఆయన అన్నారు. విలువలను పాటించడం ద్వారా సోనియా రాజకీయాల స్థాయిని పెంచారని ఆయన అన్నారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more