• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

610 జీవో అమలు: 2954 మంది బదిలీకి ఆదేశాలు

By Staff
|

హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్న 2954 మంది పోలీసు సిబ్బందిని 610 జీవోకు అనుగుణంగా వారి వారి స్వస్థలాలకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ను ఆదేశించింది. దీనితో తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు జారీ అయిన 610 జీవో అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లయింది. 610 జీవోను దశలవారీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ జోన్‌లో వివిధ హోదాల్లో పని చేస్తున్న ఈ పోలీసులను వారి వారి ప్రాంతాలకు దశలవారీగా పంపాలని నిర్ణయించినట్లు హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతుందని ఆయన చెప్పారు.

610 జీవోకు వ్యతిరేకంగా వంద మంది కోస్తా శాసనసభ్యులు సంతకాలు చేసి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. 610 జీవోకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతున్న గాదె వెంకటరెడ్డి తాము 610 జీవోకు వ్యతిరేకం కాదని, తమ అభిప్రాయాన్ని తెలియజేయడం తమ హక్కు అని ఆయన అన్నారు. 610 జీవోను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు మిగతా రాజకీయపార్టీలన్నీ డిమాండ్‌ చేస్తున్నాయి. 610 జీవోను అమలు చేయాలని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు శుక్రవారం వరంగల్‌లో డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ అనే వాదనను ఆయన ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X