వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విపక్షాలను తిప్పికొట్టేందుకే సోనియా రాజీనామా: సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

షాద్‌నగర్‌: ప్రతిపక్షాల ఎత్తుగడలను తిప్పికొట్టడానికే సోనియా గాంధీ రాజీనామాలు చేశారని సిపిఐ లోక్‌సభ సభ్యుడు సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. లాభదాయకమైన జోడు పదవుల విషయంలో వామపక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

జోడు పదవుల విషయమై అఖిల పక్ష చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పద్ధతిలో తీసుకుంటే 45 నుంచి 50 మంది సభ్యులు రాజీనామాలు చేయాల్సి వస్తుందని, దీని వల్ల మినీ జనరల్‌ ఎలక్షన్స్‌ లాంటివి జరపాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ సమస్యను నివారించడానికి ప్రసుత్త చట్టాన్ని సవరించాలి లేదా కొత్త చట్టం తేవాలని ఆయన అన్నారు. అందుకు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి చర్చ జరపాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X