• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణపై అవగాహన సదస్సులు: దత్తాత్రేయ

By Staff
|

హైదరాబాద్‌: తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి త్యాగమూర్తిగా అభివర్ణించడాన్ని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు.

రాయబరేలీ నుంచి తిరిగి పోటీ చేస్తానని చెప్పడాన్ని బట్టే సోనియా గాంధీ అధికార దాహం అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. సోనియాను ముఖ్యమంత్రి రాముడితో పోల్చడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సర్వస్వం త్యాగం చేసి రాముడు అడవులకు వెళ్లిపోయాడని, సోనియా గాంధీ 10 జనపథ్‌ వదిలి వెళ్లిపోతే ఆ విధంగా అనడం ఏమైనా సబబుగా వుంటుందని ఆయన అన్నారు. రాముడికి, సోనియాకు ఏ విధమైన పొంతనా లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X