• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గంగవరం మత్స్యకారులపై లాఠీలు: ఉద్రిక్తత

By Staff
|
విశాఖపట్నం: పునరావాసం కల్పించాలని ధర్నా చేస్తున్న గంగవరం గ్రామస్తులకు, పోలీసులకు మధ్య సోమవారం ఉదయం జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడు. మరణించిన వ్యక్తిని స్టీల్‌ ఫ్యాక్టరీ ఉద్యోగి చౌడపల్లి నూకరాజుగా గుర్తించారు. ఈ సంఘటనలో 23 మంది పోలీసులకు, 10 మంది మత్స్యకారులకు గాయాలయ్యాయని ప్రభుత్వం చెబుతుండగా, గాయపడిన మత్స్యకారుల సంఖ్యే అధికమని ప్రతిపక్షపార్టీలు చెబుతున్నాయి. గంగవరం రేవు పనుల వద్ద గ్రామస్తులు ధర్మా చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు సోమవారం తెల్లవారుజామునే భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గంగవరం గ్రామస్తులలో అత్యధికులు మత్స్యకారులే. మత్స్యకారులను శిబిరాల నుంచి యారాడకు తరలించడానికి అధికారులు ప్రయత్నించగా వారు ప్రతిఘటించారు. ఆ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన కారులపై బాష్పవాయువును ప్రయోగించారు. ఆ తర్వాత లాఠీ చార్జి చేశారు. పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో గాలిలోకి కాల్పులు జరిపామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

గాయపడిన పోలీసులను విశాఖపట్నంలోని కెజిహెచ్‌ ఆస్పత్రికి, ఆందోళనకారులను ఆగనంపూడి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో డిమాండ్‌ చేశారు. మరణించినవారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి, గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలేసి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు. గంగవరం పోర్టు ఘటనపై శాసనసభలో ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పునరావాసం కల్పించిన తర్వాతనే గంగవరం పోర్టు పనులను చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. బాధ్యులపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more