వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనేం డెడ్‌లైన్లు పెట్టలేదు: నరేంద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తమ మంత్రి పదవులకు రాజీనామా చేయడానికి తాను ఏ విధమైన డెడ్‌లైన్‌ పెట్టలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యుపిఎ ప్రభుత్వం మే పదవ తేదీలోగా చర్యలు తీసుకోకపోతే రాజీనామాలు చేసి యన్‌డిఎలో చేరుతామని తాను అన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని తాము కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంటులో ప్రతిపాదిస్తే బలపరుస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రకటించిందని, కాంగ్రెస్‌ పూనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించాలని కాంగ్రెస్‌పై తాము ఒత్తిడి తెస్తామనే తాను అన్నానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X