• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గంగవరం ఘటనపై బంద్‌ ప్రశాంతం

By Staff
|
విశాఖపట్నం: గంగవరం మత్స్యకారులపై పోలీసు కాల్పులకు నిరసనగా మంగళవారం గాజువాక బంద్‌ ప్రశాంతంగా జరిగింది. గంగవరం మత్స్యకారులపై సోమవారంనాడు పోలీసులు కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో సోమవారం శాసనసభ అట్టుడికిపోయింది. తెలుగుదేశం, వామపక్షాల కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తూ బంద్‌ను నిర్వహించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. చాలా మంది స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు.

ఇదిలావుంటే, గంగవరం సంఘటనపై మానవ హక్కుల సంఘం జిల్లా కలెక్టర్‌కు, జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌కు నోటీసులు జారీ చేసింది. పత్రికల వార్తల ఆధారంగా తనకు తానుగా ఈ సంఘటనపై మానవ హక్కుల కమీషన్‌ విచారణను చేపట్టింది. గంగవరం సంఘటనపై ఏప్రిల్‌ 3వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని కమీషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more