వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిరమ్మ పథకం తూ.గోలో ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కపిలేశ్వరం సమీపంలోని పశ్చిమ కండ్రిగలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

తూర్పుగోదావరి జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని, ఈ కారణంతోనే ఇందిరమ్మ పథకాన్ని ఈ జిల్లాలో ప్రారంభిస్తున్నట్టు వె ల్లడించారు. ప్రజాప్రస్థానంలో తాను అనారోగ్యానికి గురైనప్పుడు ఈ జిల్లావాసులు తనను ఎంతగానో ఆదరించారని గుర్తుచేసుకున్నారు. కపిలేశ్వరపురం సభలో చేసిన ప్రసంగంలో అనేక సార్లు సోనియా పేరును ప్రస్తావించి వైఎస్‌ తన విధేయతను చాటుకున్నారు. కపిలేశ్వరపురంలోని వేదపాఠశాల, హరికథా శిక్షణాలయాలను ఈ సందర్భంగా సిఎం సందర్శించారు. అనంతరం అమలాపురంలో రాజీవ్‌ అభ్యుదయ యోజన పథకాన్ని వైఎస్‌ ప్రారంభించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X