వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైకోర్టు తీర్పుపై సుప్రీంలో బంజ్‌దేవ్ పిటిషన్
న్యూఢిల్లీ: ఎస్టీ కాదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ విజయనగరం జిల్లా సాలూరు శాసనసభ్యుడు బంజ్‌దేవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బంజ్‌దేవ్ ఎస్టీ కాదని, ఆయన ఎన్నిక చెల్లదని అంటూ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి గెలిచినట్లు హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు హైకోర్టు బంజ్‌దేవ్‌కు అవకాశం కల్పించింది.
బంజ్‌దేవ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకకరించింది. దీపై విచారణను సుప్రీంకోర్టు రెండు వారాకలు వాయిదా వేసింది. బంజ్‌దేవ్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ సాలూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బంజ్‌దేవ్ ఒరిస్సాకు చెందిన క్షత్రియుడని హైకోర్టు తీర్పులో పేర్కొంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!