వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మే 8న రాయబరేలీ ఉప ఎన్నిక

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభకు మే 8వ తేదీన ఉప ఎన్నిక జరుగుతుంది. రాయబరేలి ఎన్నికల తేదీని ఎన్నికల కమీషన్‌ సోమవారంనాడు ప్రకటించింది. దీంతో పాటు మరో పది లోక్‌సభ స్థానాలకు కూడా అదే రోజు ఎన్నిక జరగుతుంది.

లాభదాయకమైన జోడు పదవులు వివాదంలో సోనియా గాంధీ తన లోక్‌సభ స్థానానికి మార్చి 23వ తేదీన రాజీనామా చేశారు. తాను తిరిగి రాయబరేలి నుంచి పోటీ చేస్తానని సోనియా గాంధీ తాను రాజీనామా చేసిన వెంటనే ప్రకటించారు. రాజీనామా అనంతరం ఆమె రాయబరేలీలో పర్యటించారు కూడా. రాయబరేలీ ఉప ఎన్నికకు ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఈ నెల 20. మే 8వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 11వ తేదీన జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X