వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబ్లీ నిరోధానికి ఏ చర్యకైనా సిద్ధమే: వైయస్
నిజామాబాద్: మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును ఆపించడానికి ఏ చర్యలకైనా తీసుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపించడానికి అవసరమైతే కోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన శుక్రవారం నాడు పోచారం కాలువ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.
బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందని ఆయన విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేస్తామని చెప్పిన మహారాష్ట్ర దాన్ని అపకపోవడం సరైంది కాదని ఆయన అన్నారు. నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు మధుయాష్కీ గౌడ్‌పై దాడి జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. గుత్ప, అలీసాగర్‌ల నుంచి వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి నీరు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!