• search

ఇతర రాష్ట్రాలకు ఆంధ్ర ఆదర్శం: వైయస్‌

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    న్యూఢిల్లీ: నక్సల్స్‌ సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు సూచించినట్లు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. నక్సల్స్‌ సమస్యపై గురువారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ సూచన చేసినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు పథకాలు అమలు చేస్తున్నామని, గిరిజనులకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. రోడ్ల నిర్మాణం ద్వారా పనులు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నక్సల్స్‌ సమస్య అదుపులో ఉందని ఆయన చెప్పారు. నక్సల్స్‌ సమస్యను తాము కేవలం శాంతిభద్రతల సమస్యగా కాకుండా సామాజిక, ఆర్థిక సమస్యగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇందిరమ్మ పథకం ద్వారా అన్ని ప్రాథమికావసరాలను కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.

    తాము రేషన్‌ కార్డులు కూడా ఇప్పించలేని స్థితిలో వున్నామని కొన్ని రాష్ట్రాలు చెప్పాయని, తాము ఆ సమస్యను అధిగమించామని, ఈ విషయంలో చాలా రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుందని ఆయన అన్నారు. నక్సల్స్‌ సమస్య పరిష్కారంలో మిగతా రాష్ట్రాల పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వడానికి మన రాష్ట్ర పోలీసు అధికారులను పంపాలని కేంద్రం కోరిందని, మన రాష్ట్ర అధికారుల అభిప్రాయాలను తెలుసుకుని ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని, రిటైర్డ్‌ అధికారులనైనా పంపుతామని చెప్పామని ఆయన వివరించారు. ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌ను పంపడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసిందని ఆయన చెప్పారు. నిధులు సమస్య కాదని, ఎంతైనా ఇస్తామని కేంద్రం తెలిపినట్లు రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. సమావేశంలో నక్సల్స్‌తో చర్చల విషయం ప్రస్తావనకు రాలేదని ఆయన చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం కూడదని కేంద్రం సూచించిందని ఆయన చెప్పారు. మావోయిస్టులు విచక్షణారహితంగా హత్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అందుకు కర్నూలు జిల్లా వేంపెంట సంఘటనను ఆయన ఉదహరించారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more