వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమ్మె విరమణకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: సమ్మె విరమించి నాలుగు రోజుల్లోగా విధుల్లో చేరాలని రాష్ట్ర హైకోర్టు జూనియర్ డాక్టర్లను ఆదేశించింది. ప్రభుత్వంపై నమ్మకం లేకనే జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే జూనియర్ డాక్టర్లు దేశం విడిచి వెళ్లవచ్చునని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా ప్రతిరస్పందించారు. ఈ నెల 18వ తేదీలోగా విధుల్లో చేరకపోతే జూనియర్ డాక్టర్ల డిగ్రీలు రద్దు చేయాలని సూచించారు. సమ్మె వద్దని చెప్పినా మళ్లీ చేశారని, అందువల్ల జూనియర్ డాక్టర్ల మీద కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రోగులకు వైద్య సేవలందించే విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆర్మీ, రైల్వే వైద్యుల సహాయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.
సమ్మెను కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. ఈ నెల 16వ తేదీన ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినందున అప్పటి వరకు సమ్మెను కొనసాగిస్తామని వారు చెప్పారు. అయితే జూనియర్ డాక్టర్లు మాట తప్పినందున 16వ తేదీన చర్చలు ఉండవని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె. రోశయ్య అన్నారు. ఈ రోజు ఉదయం విధుల్లో చేరుతామని జూనియర్ డాక్టర్లు మాట తప్పారని ఆయన చెప్పారు. ప్రభుత్వం చొరవ తీసుకుని జూనియర్ డాక్టర్లను చర్చలకు పిలిచే అవకాశం లేదని, వారంతట వారు చర్చలకు వస్తే మాత్రం మాట్లాడుతామని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!