వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎస్సి, ఎస్టిలకు తక్కువ వడ్డీకి రుణాలు: వైయస్
హైదరాబాద్: పరిశ్రమల స్థాపనకు ఎస్సి, ఎస్టిలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. అంబేద్కర్ జయంతి ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ఈ పథకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సహాయ సంస్థ ( ఎపియస్యఫ్సి) ద్వారా ఈ రుణాలు ఇప్పిస్తామని ఆయన చెప్పారు. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే ఎస్సి, ఎస్టిలకు 5 వేల నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు రుణాలు ఇప్పిస్తామని ఆయన చెప్పారు.
పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే వారు 22.5 శాతం పెట్టుబడితే చాలునని, మిగతాదంతా ఎపియస్యఫ్సి ద్వారా రుణంగా పొందవచ్చునని ఆయన చెప్పారు. వెనకబడిన వర్గాలవారు ఆర్థికంగా, సాంఘిక అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!