దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search

భద్రతా వైఫల్యం లేదు: సూరీడి హత్యపై డిజిపి

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్‌: తెలుగుదేశం నాయకుడు సూర్యప్రతాప రెడ్డి హత్య జరడానికి భద్రతా లోపం కారణం కాదని రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ సేన్‌ స్పష్టం చేశారు. సూర్యప్రతాపరెడ్డి హత్యకు బాధ్యులైనవారు ఎంతటి వారైనా పట్టుకుని తీరుతామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎవరికైనా భద్రతను ఎక్కువగానీ, తక్కువగానీ కల్పించడం లేదని, ముప్పు తీవ్రతను బ ట్టి భద్రతలను కల్పిస్తున్నామని, సూర్యప్రతాపరెడ్డికి భద్రత కల్పించామని ఆయన చెప్పారు.

    సూర్యప్రతారెడ్డి హత్య భద్రతాలోపం వల్ల జరిగింది కాదని, భద్రత ఉన్న ఇటువంటి సంఘటనలు జరడానికి వీలుందని రాయలసీమ ఐజి సాంబశివరావు అన్నారు. సూర్యప్రతాపరెడ్డి తన రాకను పోలీసులకు తెలియజేయలేదని, అలా తెలియజేసి వుంటే మరింత భద్రత ఏర్పాట్లు చేసి వుండేవారమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సూర్యప్రతాపరెడ్డి హత్య దురదృష్టకరమని ఆయన అన్నారు. రాయలసీమలో ఫాక్షనిజం పడగ విప్పుతున్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. ఫాక్షనిజాన్ని అరికట్టడానికి తాము శాయశక్తులా కృషి చేస్తున్నామని, అయితే తమకు కూడా పరిమితులు ఉన్నాయని ఆయన అన్నారు.

    చాలా వరకు ఫాక్షనిజాన్ని నిరోధించగలుగుతున్నామని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో నక్సలిజం, ఫాక్షనిజం, రాజకీయాలు కలగలసి పోయాయని, చాలా మంది ఎప్పుడు ఏది అనుకూలంగా వుంటే దాన్ని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. సూర్యప్రతారెడ్డి హత్యకు బాధ్యులైనవారిని 24 గంటల్లో గుర్తిస్తామని ఆయన చెప్పారు. బాధ్యులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సూర్యప్రతాపరెడ్డి అంగరక్షకుడిని పోలీసు అధికారులు ప్రశ్నించారు. అతడ్ని రహస్య ప్రదేశానికి తరలించారు. అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియదు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more