వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనంతపురం జిల్లా బంద్ ప్రశాంతం
అనంతపురం: తమ పార్టీ నాయకుడు సూర్యప్రతాపరెడ్డి హత్యకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బుధవారం తలపెట్టిన గా ముగిసింది. బంద్ సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాలను, వాణిజ్య సంస్థలను మూసివేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రదర్శనగా తిరుగుతూ దుకాణాలను, సంస్థలను మూయించారు.
కళ్యాణదుర్గం, గుంతకల్, తాడిపత్రి ప్రాంతాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. జిల్లాలో బుధవారంనాడు ఆర్టీసి బస్సులు నడపలేదు. బంద్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు. బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే, గురువారం జరిగే సూర్యప్రతాపరెడ్డి అంత్యక్రియలకు హైదరాబాద్ నుంచి ఒక బృందాన్ని పంపాలని తెలుగుదేశం పార్టీ బుధవారం హైదరాబాద్‌లో నిర్ణయం తీసుకుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!