వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురు షూటింగ్‌లో గాయపడిన ఐశ్వర్య

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌: మణిరత్నం గురు సినిమా షూటింగ్‌లో ప్రముఖ బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌ గాయపడింది. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే పెద్ద ప్రమాదమేమీ లేదు. ఆమె చేతికి స్వల్పంగా గాయమైంది. ఐశ్వర్యారాయ్‌ సెట్‌లో గాయపడడం ఇదే మొదటిసారి కాదు. రాజ్‌కుమార్‌ సంతోషి ఖాకీ షూటింగ్‌ సందర్భంగా జీపు ఢీకొట్టడంతో ఆమె గతంలో ప్రమాదానికి గురైంది.

గతంలో దర్శకుడు మణిరత్నం కూడా షూటింగ్‌లో గాయపడ్డాడు. యువ షూటింగ్‌లో బైక్‌ యాక్సిడెంట్‌లో ఐశ్వర్యారాయ్‌ మాజీ బాయ్‌ఫ్రెండ్‌ వివేక్‌ ఒబరాయ్‌ కూడా గాయపడ్డాడు. అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ నటిస్తున్న గురు సినిమా షూటింగ్‌ ప్రస్తుతం బెంగుళూర్‌లో జరుగుతోంది. ఐశ్వర్య రేపు తిరిగి షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X