వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విపి సింగ్ కొత్త పార్టీ జ నమోర్చా
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి వి పి సింగ్ జన మోర్చా పేరుతో ఆదివారం కొత్త పార్టీ స్థాపించారు. దీనికి అధ్యక్షుడిగా సమాజ్‌వాది పార్టీ బహిష్కృత నేత రాజ్‌బబ్బర్‌ను నియమించారు. జనమోర్చా విపి సింగ్ కొంతకాలం కిందట స్థాపించిన కిసాన్ మోర్చా పార్టీతో కలిసి పనిచేస్తుందని రాజ్ బబ్బర్‌తో కలిసి విపి సింగ్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళల సమస్యలపై కిసాన్‌మోర్చా గత కొంతకాలంగా పోరాటం చేస్తుందని, అయితే వారి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు తమ పార్టీ తరపున ప్రతినిధులను అసెంబ్లీలకు, పార్లమెంట్‌కు పంపించాలనని నిర్ణయించామని ఆయన అన్నారు. జనమోర్చా కిసాన్ మోర్చాకు అనుబంధంగా పనిచేస్తుందని విపిసింగ్ చెప్పారు. కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్‌ను జనమోర్చాకు కన్వీనర్‌గా నియమించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!