దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search

సోనియా ప్రకటన ఎందుకు ఇప్పించలేదు?: బిజెపి

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటనను ఎందుకు ఇప్పించలేకపోతున్నారని భారతీయ జనతాపార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు కె. చంద్రశేఖర్‌ రావు, ఎ. నరేంద్రలను ప్రశ్నించారు. మే 10వ తేదీలోగా మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని తెరాస నేతలు ప్రకటించి ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెట్టకపోతే యుపిఎ నుంచి బయటకు వస్తామని చెప్పిన తెరాస నేతలు ఇప్పుడు బిల్లును వర్షాకాలం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. కెసిఆర్‌ సోనియా గాంధీ అధికార ప్రతినిధిగా మారారా? అని ఆయన ప్రశ్నించారు. గత రెండేళ్లలో తెలంగాణపై సోనియా గాంధీ ప్రకటన ఎందుకు ఇప్పించలేకపోయారని ఆయన తెరాస నేతలను అడిగారు.

    తెలంగాణ పట్ల తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ (టిఆర్‌సిసిసి) నేతల తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పేరు మీద హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయించాలనే ప్రయత్నాల్లో ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి ఉంటే టిఆర్‌సిసిసి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన అడిగారు. తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నా మంత్రి పదవులు రావనే భయంతో టిఆర్‌సిసిసి నేతలు నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు. తాము వేసిన 16 ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో కాంగ్రెస్‌, తెరాసలు ఉన్నాయని ఆయన విమర్శించారు. వైయస్‌ మీద టిఆర్‌సిసిసికి విశ్వాసం ఉందా అని ఆయన అడిగారు. తెలంగాణకు వైయస్‌ అడ్డుపడుతుంటే టిఆర్‌సిసిసి ఏమీ మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే మద్దతిస్తామని తాము జనం మధ్య ప్రకటించిన తర్వాత కూడా లేఖ కావాలనడం విచిత్రమని ఆయన అన్నారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more