వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫాక్షనిజంపై బహిరంగ చర్చకు సిద్ధం: సియల్పీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఫాక్షనిజంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని కాంగ్రెస్‌ లెజిస్టేచర్‌ పార్టీ ప్రకటించింది. పాక్షనిజంపై బహిరంగ చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు.

రాష్ట్రంలో ఫాక్షనిజానికి తెలుగుదేశం పార్టీయే ఆజ్యం పోసిందని ఆయన విమర్శించారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఫాక్షనిజంపై చర్చను తామే లేవనెత్తుతామని ఆయన చెప్పారు. తాము తెలుగుదేశం పార్టీతో బహిరంగ చర్చకు కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లోనైనా ఫాక్షనిస్టులను దూరంగా ఉంచుదామని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి పిలుపునకు తెలుగుదేశం పార్టీ సానుకూలంగా ప్రతిస్పందించడం అవసరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X