దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search

తెలంగాణపై మా లేఖ అక్కర్లేదు: కెకె

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్‌: తెలంగాణపై ప్రణబ్‌ కమిటీ నేతృత్వంలోని ఉపసంఘానికి తమ పార్టీ లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నుంచి కూడా లేఖ కావాలని ఉపసంఘం సభ్యుడు రఘువంశప్రసాద్‌ సింగ్‌ చేసిన ప్రకటనపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా ప్రతిస్పందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని తామే లేవనెత్తామని, సియంపిలో చేర్చామని, రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ప్రస్తావన ఉందని, ఇన్ని జరిగిన తర్వాత తాము విడిగా లేఖ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన అన్నారు.

    ఫాక్షనిజంపై చర్చ జరగాలని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. రాష్ట్రంలో ఫాక్షనిజాన్ని అంతమొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫాక్షనిజాన్ని రాజకీయాల నుంచి దూరం చేసిన తర్వాత ఇతర ఫాక్షనిజాన్ని అరికట్టడం సులభమవుతుందని ఆయన అన్నారు. అందువల్ల రాజకీయాల నుంచి ఫాక్షనిజాన్ని దూరం చేయడానికి సానుకూలంగా ముందుకు రావడం అవసరమని ఆయన అన్నారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more