వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ జిల్లాలో యువతిని నరికిన ప్రేమ ఉన్మాది
విశాఖపట్నం: తనను ప్రేమించడం లేదనే కోపంతో విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం మేడపర్తి గ్రామంలో ఒక యువకుడు ప్రేమ ఉన్మాదంలో ఒక యువతిని నరికాడు. వరుసకు మేనకోడలు అయిన దేవుడమ్మ తన ప్రేమను నిరాకరిస్తోందనే ఆగ్రహంతో సత్యనారాయణ మెడపై నరికాడు. నీళ్లు తేవడానికి వెళ్లిన దేవుడమ్మను సత్యనారాయణ నరికి హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు.
తీవ్రంగా గాయపడిన దేవుడమ్మకు మొదట ఎస్. కోటలో చికిత్స చేశారు. అనంతరం విశాఖపట్నంలోని కెజిహెచ్‌కు తరలించారు. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు చెప్పారు. తాను ప్రేమించడం లేదని దేవుడమ్మ ఎంత చెప్పినా సత్యనారాయణ వినలేదని, వెంటపడుతూ వేధించసాగాడని అంటున్నారు. చివరకు కోపంతో హత్య చేయడానికి ఒడిగట్టాడు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!