వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ.డాక్టర్ల సమస్యల పరిష్కారానికి ఆదేశం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూనియర్‌ డాక్టర్ల సమస్యల పరిష్కారంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. జూనియర్‌ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి కోర్టు ఇంతకు ముందు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కూడా సూచించింది.

జూనియర్‌ డాక్టర్లకు మూడు సమస్యలకు సంబంధించిన అంశాలను ఆరు నెలల లోగా పరిష్కరించాలని 2005 జూన్‌లో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయలేదు. దాంతో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హైకోర్టు తాజాగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూనియర్‌ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని హైకోర్టు అభిప్రాయపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X