వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యస్పీని తిట్టడం ఎమ్మెల్యేకు తగదు: డిజిపి

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: నల్లగొండ పోలీసు సూపరింటిండెంట్‌ (యస్పీ)ని తిట్టడం శాసనసభ్యుడిగా ఆర్‌. దామోదర్‌ రెడ్డికి తగదని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ సేన్‌ అన్నారు. తెలుగుదేశం నాయకుడు సూర్యప్రతాపరెడ్డి హత్యకేసును పూర్తి పారదర్శకంగా విచారిస్తామని ఆయన చెప్పారు. అనంతపురంలో ఆయన శనివారంనాడు ఉన్నతాధికారులతో రాయలసీమలో ఫాక్షనిజంపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

కోకాను సవరించి, ఫాక్షనిస్టులను అరికట్టడానికి దాన్ని ప్రయోగిస్తామని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో ఫాక్షనిజం పెరిగే అవకాశం ఉందని, దాన్ని అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన చెప్పారు. రాయలసీమలో ఫాక్షన్‌ జోన్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఫాక్షనిజాన్ని అరికట్టేందుకు సమర్థులైన సిబ్బందిని నియమించుకునే బాధ్యత జిల్లాల యస్పీలదేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X