ధోనీ టాప్ ర్యాంక్‌ను కొట్టేసిన గిల్‌క్రిస్ట్
ముంబాయి: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గిల్‌క్రిస్ట్ దెబ్బతో భారత బ్యాట్స్‌మన్ మహేంద్రసింగ్ ధోనీ ఐసిసి ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కోల్పోయాడు. తాజా ఎల్జి ఐసిసి ర్యాకింగ్స్లో గిల్‌క్రిస్ట్ ప్రథమ స్థానాన్ని పొందాడు. దీంతో ధోనీ రెండో స్థానానికి దిగజారాడు. అంతకు ముందు మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అధిగమించి ధోనీ మొదటి స్థానాన్ని పొందాడు. ఇప్పుడు గిల్‌క్రిస్ట్ తమ కెప్టెన్‌ను కూడా దాటేసి మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. పాంటింగ్ మూడో స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల్లో చూపిన ప్రతిభ ద్వారా గిల్‌క్రిస్ట్ మొదటి స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం మొదటి పది స్థానాల్లో నలుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఆండ్య్రూ సైమండ్స్ నాలుగో స్థానాన్ని, మైకెల్ హుస్సే ఐదో స్థానాన్ని పొందారు. కాగా, బారత బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ బౌలర్ల ఎల్జి ఐసిసి ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం పొందాడు. దక్షిణాఫ్రికాకు చెందని షాన్ పొలాక్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్లలో దక్షిణాప్రికాకు చెందిన షాన్ పొలాక్, ఇంగ్లాండుకు చెందిన ఆండ్య్రూ ఫ్లింటాఫ్, భారత్‌కు చెందిన ఇర్ఫాన్ పఠాన్ వరుసగా మూడు స్థానాలను పొందగా ఆస్ట్రేలియాకు చెందిన సైమండ్స్ నాలుగో స్థానం పొందాడు.