• search

తెలుగు ఇంజినీర్‌ను హత్య చేసిన తాలిబాన్లు

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రి అఫ్ఘానిస్ధాన్‌లో కిడ్నాప్‌ అయిన హైదరాబాద్‌ ఇంజినీర్‌ సూర్యనారాయణను ఆదివారం ఉదయం హత్యచేశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న హైదరాబాద్‌లోని ఆయన కుటుంబ సభ్యులు శోక సాగరంలో మునిగిపోయారు. తానిబాన్లు ఆదివారం రాత్రి ఏడు గంటల వరకు డెడ్‌లైన్‌ విధించినప్పటికీ ఆదివారం ఉదయమే హత్య చేశారు. తాలిబాన్ల చెర నుంచి తప్పించుకోడానికి సూర్యనారాయణ ప్రయత్నించడంతో ఆయనను హత మార్చినట్టు తెలుస్తోంది. సూర్యనారాయణ హత్యను భారత ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సలహాదారు, తెలుగు వ్యక్తి సంజయ్‌ బారు ధృవీకరించారు.

    విధి నిర్వహణ నిమిత్తం అఫ్ఘానిస్థాన్‌లో ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్‌ సూర్యనారాయణను శుక్రవారం రాత్రి తాలిబన్లు కిడ్నాప్‌ చేశారు. సూర్యనారాయణ అమెరికా గూఢచారి అని ఆరోపిస్తూ, అఫ్ఘానిస్థాన్‌లో ఉన్న భారతీయులందరూ 24 గంటల్లోగా (ఆదివారం రాత్రి 7 గంటల్లోగా) దేశం విడిచివెళ్లకపోతే సూర్యనారాయణను చంపివేస్తామని తాలి బన్లు శనివార ంనాడు హెచ్చరించారు. తాలిబన్ల అధికార ప్రతినిధినని చెప్పుకుంటూ యూసుఫ్‌ అహ్మదీ అనే వ్యక్తి పత్రికలకు ఈ హెచ్చరిక జారీ చేశారు. 41 ఏళ్ళ సూర్యనారాయణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.బహ్రెయిన్‌లోని అల్‌ మోయిద్‌ కంపెనీలో ఇంజనీరుగా పని చేస్తున్న సూర్యనారాయణ నాలుగు నెలల క్రితం కంపెనీ పని మీద అఫ్ఘానిస్థాన్‌ వెళ్ళారు.

    శుక్రవారం రాత్రి దక్షిణ అఫ్ఘాన్‌లోని జబూల్‌ రాష్ట్ర రాజధాని కలాట్‌కు వెళుతుండగా, దారిలో కాందహార్‌-కాబూల్‌ జాతీయ రహదారిపై తాలిబన్‌లు ఆయనను పట్టుకున్నారు.సూర్యనారాయణతో పాటు ఆయన కారు డ్రైవర్‌ను కూడా కిడ్నాప్‌ చేశారు. ఆ డ్రైవర్‌ అఫ్ఘాన్‌ జాతీయుడేనని తెలిసింది.కాగా, తాలిబన్ల హెచ్చరికతో కలవర పడిన భారత ప్రభుత్వం సూర్యనారాయణ విడుదల కోసం యత్నాలను ముమ్మరం చేసింది. ఈ విషయంలో కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులకు సహకరించడం కోసం న్యూఢిల్లీ నుంచి నిపుణుల బృందాన్నొకదాన్ని పంపించింది. ఇదిలా ఉండగా, సూర్యనారాయణ తల్లి దండ్రులు శనివారం రాత్రి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని కలవడానికి విఫలయత్నం చేశారు. తాలిబన్ల డెడ్‌లైన్‌తో బెంబేలెత్తిన సూర్యనారాయణ కుటుంబీకులు ముఖ్యమంత్రి సహాయం అర్థించడం కోసం ఆయన నివాసానికి వెళ్ళారు. అయితే ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని, ఆదివారం ఉదయం ఆయన కలుస్తారని చెప్పి ముఖ్యమంత్రి పిఎ వారిని పంపివేశారు.

    మరోవైపు అఫ్ఘాన్‌లో జరుగు తున్న పరిణామాలపై శనివారం అత్యవసరంగా క్యాబినెట్‌ కార్యదర్శి బి.కె.చతు ర్వేది అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని తెలిసింది. సూర్య నారాయణను క్షేమంగా విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఇ. అహ్మద్‌ తెలిపారు. ఇందుకోసం అఫ్ఘాన్‌ ప్రభుత్వం, అల్‌మోయద్‌ కంపెనీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. అఫ్ఘాన్‌లో పని చేస్తున్న వెయ్యి మంది భారతీయుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని విదేశాంగ శాఖ కార్యదర్శి శ్యామ్‌ శరణ్‌ అఫ్ఘాన్‌ ప్రభుత్వానికి, సంబంధిత కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. తాజా పరిణామాల దృష్ట్యా అక్కడి భారతీయుల భద్రత కోసం సుశిక్షితులైన 200 మంది కమెండోల ను అఫ్ఘాన్‌కు పంపుతు న్నట్లు ఆయన చెప్పారు. అలాగే సూర్యనారాయణ విడుదలకు సహకరించాల్సిందిగా అమెరికా ఆధ్వర్యంలోని అంతర్జాతీయ భద్రతా దళాలను కోరినట్టు ఆయన చెప్పారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more