వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక అవార్డుల రంగంలోకీ ల్యాంకో గ్రూప్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: విద్యుత్‌, ఐటి, నిర్మాణం, వినోద రంగాలతో సహా అయిదు ప్రధాన రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లాంకో సంస్థ భిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి వారి సేవలకు గుర్తింపుగా వార్షిక అవార్డులు నెలకొల్పింది. శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో లాంకో గ్రూప్‌ అధినేత, కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఈ అవార్డులు నెలకొల్పుతున్నట్లు ప్రకటిస్తూ విద్య, ఆరోగ్యరక్షణ, న్యా యం-మానవహక్కులు, ప్రజాచైతన్యం, నాయకత్వం-ప్రజాసేవ-సామాజికాభివృద్ధి విభాగాల్లో విశేషమైన సేవలందించిన వారికి ఇక నుంచి ఏటా ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు తెలియచేశారు. అవార్డు కింద అయిదు లక్షల రూపా యల నగదు, ఒక ప్రశంసాపత్రం, ఒక ట్రోఫీ అందిస్తామని చెప్పారు.

కార్పొరేట్‌ సామాజిక బాధ్యతల పట్ల విశ్వాసం ఉన్న తమ సంస్థ సామాజిక బాధ్యతల నిర్వహణ పట్ల ఆసక్తి కలిగి ఉండి విశేషమైన సేవలందించే వారికి ఈ అవార్డులు ఇవ్వతలపెట్టిందన్నారు. తమ సంస్థకు అనుబంధంగా పని చేస్తున్న లాంకో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జనరల్‌ హ్యుమానిటేరియన్‌ ట్రస్ట్‌ ద్వారా ఈ అవార్డులు అందిస్తామని చెబుతూ కార్పొరేట్‌ సామాజిక బాధ్యతల నిర్వహణ కోసం ఏటా కోటి రూపాయలకు పైగా వ్యయం చేస్తున్నామని తెలిపారు. ఈ జాతీయస్థాయి అవార్డులను ప్రతీ యేటా సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో ప్రకటించి జనవరిలో అందచేయనున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియ దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యా తులున్న ముగ్గురు సభ్యుల న్యాయనిర్ణేతల సంఘం నిర్వహిస్తుందని, ఒక్కో రంగం నుంచి ఎంపిక చేసిన ముగ్గురు సభ్యుల కమిటీలు ఈ కార్యక్రమంలో వారికి సహకరిస్తాయని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X