వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరింత విషమించిన ప్రమోద్‌ ఆరోగ్యం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: సోదరుడు ప్రవీణ్‌ మహాజన్‌ జరిపిన కాల్పుల్లో గాయపడిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన కార్యదర్శి ప్రమోద్‌ మహాజన్‌ ఆరోగ్యం మరింత విషమించింది. ప్రస్తుతం మహాజన్‌ పరిస్థితి పూర్తిగా ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు.

మహాజన్‌ శ్వాస పూర్తిగా క్షీణించిందని, కృత్రిమ శ్వాసను మరింత పెంచామని వైద్యులు చెప్పారు. సోమవారంనాడు మహాజన్‌ ఆరోగ్యం పరిస్థితి అన్ని విషయాల్లో మరింత విషమించిందని పి.డి. హిందూజా ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ అనుపమ్‌ వర్మ చెప్పారు. మహాజన్‌ బిపి నియంత్రణలో ఉందా అని అడిగితే మొత్తం పరిస్థితే కొద్దిగా మారిందని ఆయన జవాబిచ్చారు. ప్రవీణ్‌ కాల్పుల్లో గాయపడిన ప్రమోద్‌ను ఈ నెల 22వ తేదీన హిందూజా ఆస్పత్రిలో చేర్చారు. మహాజన్‌ ఆరోగ్య పరిస్థితిని నిమిష నిమిషం డాక్టర్లు డి.వి. దేవర్‌, కపాడియా పరిశీలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X