వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లంచావతారి వైద్యుడు: ఎసిబి అధికారులపై దాడి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి జాన్ భాస్కర్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అయితే ఎసిబి అధికారులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఎసిబి అధికారులను వైద్యాధికారి అనుచరులు నిర్బంధించారు. జాన్ భాస్కర్‌ను ఎసిబి అధికారులకు పట్టిచ్చిన వ్యక్తిపై వారు దాడి చేశారు.
వైద్యాధికారి అనుచరులు ఎసిబి డిసిపిపై, సర్కిల్ ఇన్స్పెకర్లపై దాడి చేశారు. ఆస్పత్రి వద్ద ప్రజల పెద్ద యెత్తున గుమికూడారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లంచం తీసుకుంటూ జాన్ భాస్కర్ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు.
Story first published: Tuesday, May 2, 2006, 23:53 [IST]