వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌, బిజెపి మినహా ఎవరితోనైనా సిద్ధం: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

ఏలూరు: కాంగ్రెస్‌, భారతీయ జనతాపార్టీలతో మినహా ఎవరితోనైనా ఎన్నికల పొత్తు పెట్టుకోడానికి సిద్ధమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. జాతీయ స్ధాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అబద్ధం ఆడడం కాంగ్రెస్‌ వారికి మామూలేనని, అందుకే వారు ఫ్యాక్షన్‌ లెక్కలను మారుస్తున్నారని పశ్చిమగోదావరి పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఫ్యాక్షన్‌ హత్యలపై హోంమంత్రి మాటలు మార్చడం దారుణమని ఆయన అన్నారు. కడప జిల్లాలో 30 ఏళ్ళ పాటు రాజకీయాల్లో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా తన ఫ్యాక్షన్‌ చరిత్రను మార్చుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ తన మీద పోటీ చేసిన అభ్యర్ధి అని అయినా చూడకుండా ఆయన మరణించడానికి పరోక్షంగా కారణమయ్యారని బాబు విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X