• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎడిబి ప్రాంతీయ కేంద్రానికి వైయస్‌ వినతి

By Staff
|

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి)ని కోరారు. ఈ ప్రాంతీయ కేంద్రం శిక్షణ, ఎంటర్‌ప్రెన్యూర్‌ అభివృద్ధికి సంబంధించిందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ కన్వెన్షనల్‌ సెంటర్‌లో ఏర్పాటయిన ఎడిబి సమావేశాల్లో రెండో రోజు గురువారం ఆయన ప్రసంగించారు.

తమ ప్రభుత్వం ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాల కార్పోరేషన్‌ ఈక్విటీలో వాటా తీసుకోవాలని కూడా ఆయన ఎడిబికి విజ్ఞప్తి చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో తమతో పాటు ఎడిబి పాలు పంచుకోగలదని ఆయన ఆశించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గురువారం ఎడిబి సమావేశాల్లో 60 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 2010 నాటికి భారత ఎగుమతులు 150 బిలియన్‌ డాలర్లకు చేరుకోగలదని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. ఈ సమావేశాల్లో గోవా ముఖ్యమంత్రి ప్రతాపసింగ్‌ రాణే, పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి, తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X