• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సియం పదవికైనా గౌరవం ఇవ్వండి: వైయస్‌

By Staff
|

తిరుమల: ముఖ్యమంత్రిగా తనను గౌరవించాలని డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులకు సూచించారు. వయసులో చిన్నవాడినైనా ముఖ్యమంత్రిగా తనను కొంచెమైనా గౌరవించడం తెలుగుదేశం పార్టీ నాయకులు నేర్చుకోవాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తనను ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారని, అందువల్ల తనకు కాకున్నా ముఖ్యమంత్రి పదవికి తెలుగుదేశం నాయకులు గౌరవం ఇవ్వాలని ఆయన అన్నారు.

తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు నేరుగా సవాలు విసిరితే ఆ పార్టీ నాయకుడు కడియం శ్రీహరి మాట్లాడిన తీరు విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు కాకుండా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సమాధానాలు ఇవ్వవచ్చు గానీ తమ పార్టీకి చెందినవారు ఎవరూ మాట్లాడకూడదనే పద్ధతి శ్రీహరి పాటిస్తున్నారని ఆయన అన్నారు. నిరాశానిస్పృహలతో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, పంచాతీయ ఎన్నికల్లో వారికి 25 - 30 శాతం మించి సీట్లు దక్కవని ఆయన అన్నారు. వెకిలినవ్వు ఏమిటో, విలన్‌ నవ్వు ఏమిటో తనకు తెలియదని, మనసారా నవ్వడం ఉంటుందని ఆయన అన్నారు. నవ్వు దేవుడు మనిషికి ఇచ్చిన వరమని ఆయన అన్నారు. ఇందిరాగాంధీపై తెలుగుదేశం నాయకుడు కడియం శ్రీహరి చేసిన విమర్శను ఆయన ఖండించారు. ఇందిరాగాంధీ కనుమరుగు కాలేదని, ప్రజల కోసం అసువులు బాసిన మహాత్మురాలు ఇందిరాగాంధీ అని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X