వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై ఈ నెల 18న బిజెపి ధర్నా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెస్‌ వైఖరులకు నిరసనగా ఈ నెల 18వ తేదీన హైదరాబాద్‌లో భారీ ధర్నా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని సమావేశానంతరం బిజెపి రాష్ట్ర ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవడేకర్‌ మీడియా ప్రతినిధుల సమావేశంలో హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై రెండేళ్లుగా కాంగ్రెస్‌, తెరాస ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకే పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదిస్తే సమర్థించాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బిజెపి పదాధికారుల సమావేశం నిర్ణయించుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X