వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిజి మెడికల్‌ కౌన్సెలింగ్‌ చెల్లదు: హైకోర్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పి.జి. మెడికల్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన కౌన్సెలింగ్‌ చెల్లదని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. పి.జి. మెడికల్‌ ప్రవేశపరీక్షలో అదనపు మార్కులు కలపడం చెల్లదని హైకోర్టు తీర్పు వెల్లడించింది. పిజి మెడికల్‌ కౌన్సెలింగ్‌ను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. పిజి మెడికల్‌ ప్రవేశపరీక్షలో ఐదు మార్కులు కలపాలనే నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

పి.జి. మెడికల్‌ కౌన్సెలింగ్‌లో 5 అదనపు మార్కులు కలపాలనేది పూర్తిగా విశ్వవిద్యాలయ నిర్ణయమేనని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ సాంబశివరావు అంటున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చర్యలు ఏం చేపట్టాలనే విషయంపై ప్రభుత్వంతో చర్చించినట్లు ఆయన తెలిపారు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X