బాబు చంద్రగిరిలో పోటీ చేస్తారా?: కాంగ్రెస్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దమ్ముంటే ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి శాసనసభకు పోటీ చేయాలని కాంగ్రెస్ శాసనసభ్యులు గాలి ముద్దు కృష్ణమ నాయుడు, కిరణ్కుమార్ రెడ్డి సవాల్ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి తప్ప మరెక్కడి నుంచి గెలవలేరని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యకు వారు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు.
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఆరు నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీని గెలిపించుకోగలిగారని వారన్నారు. చంద్రగిరి నుంచి ఓటమి చవిచూసిన చంద్రబాబునాయుడు వెనకబడిన కుప్పం నియోజకవర్గానికి మారారని వారు చెప్పారు. పేదల గృహ నిర్మాణ పథకంపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలను తెలుగుదేశం పార్టీ నాయకులు వక్రీకరిస్తున్నారని వారు విమర్శించారు.