• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వర్గీకరణ మానకుంటే ముట్టడి: మాలమహానాడు

By Staff
|

హైదరాబాద్‌: షెడ్యూల్డ్‌ కులాల (ఎస్‌సి) రిజర్వేషన్ల వర్గీకరణను మానుకోకపోతే రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలను ముట్టడిస్తామని మాలమహానాడు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణకు స్వస్తి చెప్పకపోతే భవిష్యత్తులో సంభవించే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుందని మాలమహానాడు అధ్యక్షుడు శివాజీ శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయాలంటే దేశంలోని 28 రాష్ట్రాల శాసనసభలు తీర్మానాలు చేసి పంపాల్సి ఉంటుందని, ఈ విషయం తెలిసి కూడా వర్గీకరణపై మభ్య పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే పునరంకిత సభలోగా ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణకు స్వస్తి చెబుతామని ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X