• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అగ్రస్ధానంలో కొనసాగుతున్న పోకిరి

By Staff
|

ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో మహేష్‌ బాబు పోకిరి అగ్రస్ధానంలో ఉంది. ఈ సినిమా విడుదలైన రోజు యావరేజి టాక్‌ వచ్చినప్పటికి ఆ తర్వాత విడుదలైన భారీ సినిమాలు ఫ్లాప్‌ కావడంతో ఇది పెద్ద హిట్‌ దిశగా దూసుకుపోతోంది. పోకిరి మొదటి వారంలోనే తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. పవన్‌ కళ్యాణ్‌ - ఎఎం రత్నంల భారీ సినిమా బంగారం గురించి విశ్లేషించడానికి మొదట మీడియా తటపటాయించినా ఈ సినిమా ఫ్లాప్‌ అయిందన్న వాస్తవాన్ని ఆలస్యంగా గ్రహించింది.

అయితే పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న అసంఖ్యాక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కారణంగా ఈ సినిమా మొదటి రెండు వారాల్లో మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే రిపీట్‌ ఆడియెన్స్‌ లేకపోవడం సినిమాను బాగా దెబ్బతీస్తోంది. సినిమా రెండో భాగంలో 22 నిముషాలు ట్రిమ్‌ చేయడం ద్వారా కొంత మెరుగు కన్పించినట్టు చెబుతున్నారు. హాస్యం పేరుతో ఒకరకం సినిమాలు తీసే ఇవివి సత్యనారాయణ నిర్మించి దర్శకత్వం వహించిన కితకితలు నిస్సందేహంగా ఫ్లాప్‌ అయ్యింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X